విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం *విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం తాండవ పల్లి వన్నె చింతలపూడి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా అక్రమంగా సాగు చేస్తున్న ఆక్వా చెరువులు పై చర్యలు తీసుకోవాలని సోమవారంకలెక్టరేట్ గ్రీవెన్స్ లో సామాజిక కార్యకర్త పశ్చిమాల బాబ్జి మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ద్యానకిషోర్ కి,వినతిపత్రం అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా బాబ్జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాండవ పల్లి వన్నేచింతలపూడి గ్రామంలో 2014 నుండి ఈ అక్రమంగా సాగు చేస్తున్న ఆక్వా చెరువులపైచర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నామని 2017 అప్పటి కలెక్టర్ అరుణ్ కుమార్ పై కంటెంమ్ట్ వేయగా యాభై ఆరు ఎకరాల అక్రమ ఆక్వా చెరువులపై కొరడా ఝుళిపించింది జరిగిందని చెరువులు అన్నింటికీ గండ్లు కొట్టడం జరిగిందని కానీ కొంతకాలానికి మత్స్య శాఖ రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారుల ప్రోద్బలంతో లంచాలకు అలవాటు పడిన ఈ చెరువులను నియంత్రించాల్సిన అధికారులు అక్రమ ఆక్వా మాఫియాతో చేతులు కలిపి యదేచ్ఛగా సాగుచేసేందుకు సహకరిస్తున్నారని జాయింట్ కలెక్టర్ కి విన్నవించుకున్నారు. చెరువుల పై చర్యలు తీసుకోండని పదేపదే మత్స్యశాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు వినతిపత్రాలు ఇచ్చినా నేటికీ ఆ చెరువులపై ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదు 2020లో మళ్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని హైకోర్టు ఉత్తర్వులని మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు అక్రమ ఆక్వా చెరువుల వల్ల పంట భూములు పాడు అవ్వడం తో పాటు గాలి నీరు వాతావరణం కలుషితం అవుతుందని నివాస ప్రాంతాలలో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని క్యాన్సర్ లాంటి మహమ్మారి తో కొంత మంది చనిపోవడం జరిగిందని జాయింట్ కలెక్టర్ కి విన్నవించడం జరిగింది తక్షణం అనుమతులు లేని అక్రమంగా సాగుచేస్తున్న ఈ అక్రమ ఆక్వా చెరువుల పై చర్యలు తీసుకుని వాటికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తున్న మత్స్యశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ను డిమాండ్ చేశారు.వినతిపత్రం ఇచ్చిన వారిలో రైతు బొక్క రామకృష్ణ కారెం వెంకటేశ్వరరావు పశ్చిమాల బాబ్జి తదితరులు పాల్గొన్నారు