Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కిక్ బాక్సింగ్ పోటీలో సత్తా చాటిన ఆలమూరు విద్యార్థులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆలమూరు బహుమతులు పొందిన విద్యార్థుల తో
మాస్టర్ అబ్బులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్ ):తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్.కె.వి.టి కాలేజీ ప్రాంగణంలో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ ఫ్యామిలీ సంస్థ నిర్వహించిన రాష్ట్ర కిక్ బాక్సింగ్ కరాటే, కుంగ్ పూ, పోటీలలో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ మదర్ థెరిస్సా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు తమ సత్తాచాటి గోల్డ్ మెడల్ సాధించినట్లు సీనియర్ గ్రాండ్ మాస్టర్ టి అబ్బులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం కిక్ బాక్సింగ్ బాలికల ఏ విభాగంలో కొండేటి నీలిమ గోల్డ్ మెడల్, బాలురు బి భాగంలో ఖండవిల్లి మహిమకర్ గోల్డ్ మెడల్, ఎ విభాగంలో బుంగ అశ్విన్ సిల్వర్ మెడల్, బి విభాగం మెరుపే సత్యకాంత్ గోల్డ్ మెడల్, బి విభాగంలో యు రీతిఫ్ సిల్వర్, పోతల దేవేంద్ర సిల్వర్ మెడల్, ఏ విభాగములో ఏం చందు సిల్వర్ మెడల్ మెడల్ సాధించగా, కుంగ్ పూ కటాస్ ఏ విభాగములో జొన్నాడ ప్రణీత్ సిల్వర్ మెడల్, బి విభాగం జొన్నాడ సుభాష్ సిల్వర్, రావులపాలెం కరాటే స్కూల్ కు చెందిన మద్దా వేణు సిల్వర్, మద్ద దిస్వాని బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు అబ్బులు వెల్లడించారు. మంచి ప్రతిభ కనబరిచి మెడల్ సాధించిన ఈ విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ టి అబ్బులు, సీనియర్ కుంగ్ పూ మాస్టర్ కె సత్తిబాబు, కె వి లక్ష్మి, కోచ్ టి లక్ష్మి సందీప్ కిరణ్ తదితరులు అభినందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement