విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం విశ్వం వాయిస్ న్యూస్: మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై రామచంద్రపురం ఆర్డిఓ సింధు సుబ్రహ్మణ్యం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల కేంద్రమైన రాయవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మండల అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ సింధు సుబ్రహ్మణ్యం జిల్లా అధికారులు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని గ్రామాలలో పనులు జరగాలని, సకాలంలో మాస్టర్లు అన్ని అప్లోడ్ చేయాలని అన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు డిఆర్డిఎ సిబ్బందితో హౌసింగ్ నిర్మాణం పై సమీక్షించి, గృహ నిర్మాణాల కొరకు ముందుకు వచ్చే వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా ఫైనాన్స్ ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. గృహ నిర్మాణాలు ప్రభుత్వ భవనాల నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. తొలుతగా ఆర్డిఓ సింధు మండలంలోని సోమేశ్వరం గ్రామంలో గ్రామ సచివాలయ పనితీరును, చెరువు వద్ద జరుగుతున్న ఎం జి ఎన్ ఆర్ ఇ జి ఎస్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే గ్రామంలో హౌసింగ్ ప్రోగ్రాం లో భాగంగా ఇల్లు నిర్మాణాలు పనులను పరిశీలించారు. ముందుగా సోమేశ్వరం గ్రామ సచివాలయం పరిశీలించి అక్కడ జరుగుతున్న భూముల సర్వే వివరాలు తెలుసుకుని తగు సూచనలు తెలియజేశారు. మండల కేంద్రమైన రాయవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మాణం జరుగుతున్న రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఇ వీరనారాయణ, తాసిల్దార్ కే జే ప్రకాష్ బాబు, మండల పరిషత్ ఏవో ఎం హరికృష్ణ రెడ్డి, హౌసింగ్ ఏఈ కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ జే ఈ ఈశ్వర్, గ్రామ సచివాలయ కార్యదర్శులు, ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.