Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

* ప్రమాదం గాయపడ్డ ఛాయాగ్రాహుడికి ఆర్థిక సాయం *

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

రావులపాలెం(విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం, రావులపాలెం మండలం, రావులపాలెం ప్రొఫె షనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడైన హనుమంతు నాగేశ్వరరావు ఇటీవల ప్రమాదానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుం టున్నారు. విషయం తెలుసు కున్న అధ్యక్షులు రామారెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు నాగేశ్వరరావును వారి స్వగ్రామంలో కలిసి పరామర్శించారు. ఇందులో భాగంగా రామారెడ్డి మాట్లాడు తూ, హనుమంతు నాగేశ్వర రావుకి ధన సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా అంద రూ ఇలా సహకరించాలని కోరడం జరుగుతుందని, అలాగే జిల్లా యూనియన్ నుంచి అడిగిన వెంటనే ఐదు వేల రూపాయలు పంపించిన కార్యవర్గానికి రావులపాలెం యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానిక యూనియన్ రూ 5 వేలు, జిల్లా యూనియన్ రూ 5 వేలు అలాగే పలువురు సభ్యులు నుండి సేకరించిన 20,300/- రూపాయలు (ఇరువది వేల మూడు వందలు ) వెరసి మొత్తం రూ 30,300/-రూపాయలు (ముప్పది వేలమూడు వందలు ) నగదును అధ్యక్షులు నల్లమిల్లి రామారెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనోజ్ కుమార్, కోశాధికారి కె నరసింహారావు, గౌరవ సలహాదారులు ఆర్ కె నాగేశ్వర్ రావు, లొల్ల మెంబర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement