విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్) రావులపాలెం తహశీల్దార్ కార్యాలయంలో ఆధునీకరించిన తహశీల్దార్ గదిని మంగళవారం ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రిటైర్డ్ తహశీల్దార్ కొప్పిశెట్టి దుర్గారావు తన కుమారుడు శశికాంత్ జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రి లక్ష్మి వెంకట నాగదేవి, జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, మాజీ వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్య వర్మ, తహశీల్దార్ వి.వి.వి సత్యనారాయణ, ఎంపీడీవో జి.రాజేంద్రప్రసాద్, రిటైర్డ్ తహశీల్దార్ కొప్పిశెట్టి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు…