విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:
శంఖవరం, మే 10, ( విశ్వం వాయిస్ న్యూస్) ;
2022-23 విద్యా సంవత్సరానికి 6 వ తరగతిలోనికి ప్రవేశాలకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ ప్రిన్సిపాల్ వైఎన్.రత్నం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని తమ విద్యా సంస్థలో ఆరో తరగతిలో 40 మంది విద్యార్ధులకు మాత్రమే ప్రవేశానికి ఖాళీలు ఉన్నాని ఆమె వెల్లడించారు. 7 నుంచి 10 తరగతుల వరకూ ఖాళీలు లేవని ఆమె స్పష్టం చేసారు. ఆరో తరగతిలోనికి ప్రవేశాలు కోరే అర్హులు ఈ 40 ఖాళీలకూ ఈ నెల 22 తారీఖు వరకూ అంతర్జాలంలో ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ స్పష్టం చేసారు. అనాధలు, బడిబయట పిల్లలు, డ్రాపౌట్స్, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవలని రత్నం వెల్లడించారు. అంతర్జాలం ద్వారా వచ్చిన దర్శఖాస్తులను మాత్రమే ప్రవేశాలకు పరిగణిస్తామని తెలిపారు. ఆసక్తిగల బాలికలు https://apkgbv.apcfss.in/ website ధర్మస్తులు పొందవచ్చని, ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందజేస్తామని, ఏమైనా సమస్యలు, సందేహాలకు 9494383617, 9866413575 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.