Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విద్యార్థులకు వివిధ సమ్మర్ కక్యాంపు కోర్సులలో శిక్షణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విద్యార్థులు సమ్మర్ క్యాంపు కోర్సును ఎంచుకుని
మానసిక ప్రశాంతతను పొందాలి…
జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, ఎంపిపి
నౌడ్ వెంకటరమణ…

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం విశ్వం వాయిస్ న్యూస్: విద్యార్థులందరూ సమ్మర్ క్యాంపు లో కోర్సులను ఎంచుకుని మానసిక ప్రశాంతతను ఆనందాన్ని పొందాలని జడ్పిటిసి మంగతాయారు, ఎంపీపీ వెంకటరమణ సూచించారు. మండలంలోని వెదురుపాక గ్రామంలో మంగళవారం జడ్పీ హైస్కూల్ నందు విద్యార్థులకు వివిధ సమ్మర్ క్యాంపు కోర్సులలో శిక్షణ కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు విప్పర్తి శాంతి సునిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ మల్లిడి సూరారెడ్డి చేతుల మీదగా సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జడ్పిటిసి మంగతాయారు మాట్లాడుతూ విద్యార్థులందరూ రక రకాల కోర్సులను ఎంచుకుని మానసిక ప్రశాంతతను ఆనందాన్ని పొందాలని సూచించారు. ఎంపీపీ వెంకటరమణ మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపు ను విద్యార్థులు ఆయా కోర్సుల్లో తర్ఫీదు తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను ప్రావీణ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. సర్పంచ్ సూరా రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తిగల విద్యార్థులు ఆయా రంగాలలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. హెచ్ఎం శాంతి సునీత మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంప్ మే 10 నుండి జూన్ 10 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సమ్మర్ క్యాంప్ లో పిల్లల లో ఉన్న శక్తి యుక్తులను సక్రమైన మార్గంలో ఉపయోగించుటకు యోగ, కరాటే, టెన్నిస్, చెస్, డాన్స్, డ్రమ్స్, కీబోర్డు, కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ మొదలైన కోర్సులను సుశిక్షితులైన ఉపాధ్యాయులు పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లు కొవ్వూరి అమ్మిరెడ్డి, గొబ్బల సుబ్రహ్మణ్యం, వెదురుపాక ఎంపీటీసీ సభ్యులు మండ వెంకట సత్యవతి, వార్డ్ మెంబర్ కంచి గణేష్ కుమార్, వాసంశెట్టి రామలక్ష్మి, శివాలయం ఆలయ చైర్మన్ తాడి బుల్లి వెంకటరెడ్డి, జనార్ధన్ స్వామి ఆలయ చైర్మన్ టేకుమూడి రాంబాబు, పి ఎం సి చైర్మన్ చాగంటి సత్యనారాయణ, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement