Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

దారి కోరువాయే. రోడ్లు ప్రమాదవాయే

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

మండపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

ఏడు కిలోమీటర్ల రోడ్డు. అధికార పార్టీ పరువు ను రోడ్డున పడేసింది. ఓ రాష్ట్ర స్థాయి నాయకుడి సత్తాకు ప్రశ్నార్ధకంగా మారింది. దానిపై వెళ్లే ప్రతి ఒక్కరినీ దుమ్మెత్తి పోసేలా చేసింది. ఆళ్ళు, ఈళ్ళూ అనేం ఖర్మ. సాక్ష్యాత్తు అధికార వైసీపీ పార్టీ నాయకులే ప్రభుత్వాన్ని అసహ్యించుకునేలా చేసింది. అనుక్షణం పార్టీ ప్రతిష్ఠ ను బజారుపాలు చేస్తుంది. ప్రతిపక్షాల చేతికి వజ్రాయుధంగా మారింది. మండపేట పాలకుల నిర్లక్ష్యాన్ని రాష్ట్రపతి కార్యాలయం వరకూ తీసుకెళ్లింది.* ఇదంతా కేవలం మండపేట నుండి ద్వారపూడి వరకూ వెళ్లే ఏడు కిలోమీటర్ల రోడ్డే చేసింది. ఇంత జరుగుతున్నా అదిగో ఇదిగో అంటూ ఎప్పటిలానే పిట్ట కథలు చెబుతున్నారు తప్పితే సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన పరిస్కార మార్గాలను తీసుకునే సాహసం ఏ ఒక్కరూ చేయడం లేదు. ఓ వైపు అనపర్తి లోనూ రోడ్లు పడుతున్నాయి. ఇంకో వైపు రామచంద్రాపురం నుండి కాకినాడ వెళ్లే రోడ్డులోనూ కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి. మొన్న మొన్ననే వేసిన రోడ్లతో అక్కడి ప్రజలు అక్కడి పాలకులకు దీవెనలు అందిస్తున్నారు. చుట్టుపక్కల ఇంత జరుగుతున్నా మండపేటనియోజకవర్గంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి ఎందుకు తయారయ్యిందో ఎవ్వరికి అంతుబట్టడం లేదు. ఇంకా ఏం జరగాలని ఇదంతా చేస్తున్నారని పార్టీపై కొండంత ఆశలు పెట్టుకున్న నాయకులు, కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాసి రాసి జర్నలిస్ట్ ల చేతి వేళ్ళు అరిగిపోతున్నాయి. తిట్టి తిట్టి ప్రజల నోర్లు నొప్పెడుతున్నాయి. అయినా వైసీపీ నాయకుల్లో కించిత్ చలనం కనిపించడం లేదు. ఏం పాపం చేసుకుంటే మాకీ ఖర్మ దాపురించిందిరా బాబూ అంటూ కన్నీటిపర్యంతమవుతున్న ఈ ప్రాజా ఆవేదన ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement