విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్) రావులపాలెంకు చెందిన పులగం మల్లారెడ్డి, విజయలలిత దంపతులు ఆత్రేయపురం మండలం ర్యాలి శ్రీ ఉమా కమాండలేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభం పునః నిర్మాణం నిమిత్తం రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. స్వామి వారి దర్శనం అనంతరం దాతలకు ఈవో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం, స్వామి వారి చిత్రపటం అందజేసారు. అలాగే గుంటూరు జిల్లా బ్రాడీ పేటకు చెందిన దేచిరాజు సత్యనారాయణ మూర్తి ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవ, గోపాల స్వామివారిని దర్శించుకుని స్వామి వారి అన్నదాన పధకానికి రూ.10,116 విరాళంగా సమర్పించారు. దాతకు ఈవో కృష్ణ చైతన్య స్వామి వారి ఫొటో, చరిత్ర పుస్తకం, అన్నదానం బాండ్, శేష వస్త్రం అందజేసి సత్కరించారు…