మాత్యులు చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ….
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:
రామచంద్రపురం, విశ్వం వాయిస్ న్యూస్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుజరుగుతున్న తీరు పరిశీలించడతోపాటు, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో పెండింగులో ఉన్న లభ్ది దారులకి లభ్ది చేకూర్చడమే లక్ష్యం తో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగిందని బిసి సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచారశాఖా మాత్యులు చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా ఆదివారం రామచంద్రపురం నియోజకవర్గంలో ని తాళ్లపాలం గ్రామంలోని రత్న గురువు వీధి లో మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ మండల స్థాయి అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంట్రీ లతో కలసి యింటింకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరు లభ్డిదారులు అందుతున్న సహాయం వారు వ్యక్తం చేస్తున్న సంతృప్తి తదితర అంశాలను అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవనోపాధి పెంపే లక్ష్యం గా ప్రభుత్వం నవరత్నాల పధకాల లతో పాటు ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వీటి అమలు వలన లబ్దిదారులకు ఒక్కక్కరికి లక్షా యాబై నుండి ఏడు లక్ష రూపాయలు వరకు లబ్ది చేకూరుతుందని లబ్దిదారులకు సంతృప్తి గా ఉన్నారని తెలిపారు. కొన్ని సాంకేతిక పరమైన అంశాల వలన కొంత మంది కి లబ్ది అందించడం లో సమస్యలు వస్తున్నాయని వాటిని గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరూ కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వారికి అందే లబ్ది అందేవిధంగా ముఖ్యమంత్రి వాలంట్రీ వ్యవస్థ ను తీసుకొచ్చారన్నారు. అదేవిధంగా సమస్యల పరిష్కారానికి గ్రామసచివాలయ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.
మానవవనరుల అభివృద్ధి సూచిలే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. మంత్రి గా ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని ఒక సేవకుడి గా పనిచేసి
పేదవారి సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తానని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుందని సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా గ్రామంలో ని పలువురిని పలుకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరు లభ్డిదారులకు అందుతున్న సహాయం వారు వ్యక్తం చేస్తున్న సంతృప్తి తదితర అంశాలను అడిగి తెలసుకొనే సందర్భంగా
వాసంశెట్టి పద్మ అనే లబ్ధిదారులు తనకు ప్రభుత్వ పరంగా1,55,000 రూపాయిలు అమ్మఒడి, ఆసరా పధకాల ద్వారా లభ్ది చేకూరుతుందని తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
అదేవిధంగా అదేవీథి కి చెందన గుబ్బల సూర్యారావు తనకు ప్రభుత్వ పరంగా చేయూత, ఇతర పథకాల ద్వారా1,03,000 రూపాయిలు లభ్ది చేకూరింద ని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు ఎంపీపీ అంబటి భవాని, జడ్పీటీసీ ఎం. వెంకటేశ్వరులు, సర్పంచ్ కట్టా గోవింద్ తదితరులు పాల్కొన్నారు.