మహిళా వద్ద వివరాలు సేకరిస్తున్న ఎస్ ఐ
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్ ):మండలం పరిధిలో మడికి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గృహిణి మృతి చెందినట్లు ఆలమూరు ఎస్ఐ ఎస్ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా సీతానగరం గ్రామానికి (వెంకటకృష్ణాపురం) చెందిన పోసి అభినయ (20) ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై రోడ్డు దాటుచుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఈ నెల 9వ తేదిన తన భర్త పోచయ్యతో కలిసి పొట్టిలంక తమ బంధువుల ఇంటికి శుభ కార్యానికి వచ్చిందని, భర్త ఇంట్లోనే నిద్రిస్తుండగా ఈ ప్రమాదానికి గురై మృతి చెందిందని తెలిపారు. మృతురాలి అమ్మగారిది పొట్టిలంక కాగా ఇటీవలే సీతానగరంకు చెందిన పోచయ్యతో వివాహం అయిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రులకు తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు