Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గోదారోళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సర్ అర్ధర్ కాటన్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గుమ్మిలేరు లో గానంగా కాటన్ జయంతి వేడుకలు
ఆలమూరు గ్రామ సర్పంచ్ గుణ్ణం
రాబాబు ఆధ్వర్యంలో ఘనంగా కాటన్ జయంతి వేడుకలు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్) : మండలం పరిధిలో గుమ్మిలేరు గ్రామంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివృష్టి,అనావృష్టితో అతలాకుతలం అవుతున్న గోదావరి ప్రాంతాన్ని ముందు చూపుతో చేసిన కృషి వలన గోదావరి వాసులకు నీటి పారుదల ద్వారా పంట బీడు భూములను ధాన్యాగారం భూములుగా మార్చి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి రైతులకు సాగునీరు అందించడంతో పాటు జల రవాణా కోసమని కాటన్‌ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టి లక్షల ఎకరాలకు సాగునీరు,వేలాది గ్రామాలకు త్రాగునీరు అందించి గోదారోళ్ల మనస్సుల్లో చెరగని స్థానాన్ని సంపాదించారు.ఆయన చేతికర్రతో గీసిన గీతలు డెల్టా కాలువలయ్యాయి.కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలు పచ్చటి తివాచీలుగా మారాయి.. ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరి జిల్లాలకు పునరుజ్జీవనం ప్రసాదించి ఆరాధ్య దైవంగా,అపర భగీరథుడిగా చరిత్రలో నిలిచాడాని అయన అభివర్ణించారు ఈ కార్యక్రమంలో మాజీ నీటీ సంఘం అధ్యక్షులు పాలచర్ల సత్యనారాయణ, రైతులు రెడ్డి సత్యనారాయణ,ఓలూరు రుద్రయ్య, రెడ్డి నారాయణరావు,యాళ్ళగడ్డ వీర్రాజు,టేకి వెంకన్న, రెడ్డి మాధవరావు తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement