Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అర్జీలు రీ ఓపెన్ కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ఈ సమస్య పట్ల స్పందించే తీరు క్రియాత్మకంగా ఉండాలి
– సకాలంలో తగు పరిష్కార మార్గాలను చూపాలి
– జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం, విశ్వం వాయిస్ః

అర్జీదారుల సమస్యల పట్ల స్పందించే తీరు క్రియాత్మకంగా ఉండి సకాలంలో తగు పరిష్కారమార్గాలు పూర్తిస్థాయిలో చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో సుమారుగా 140 మంది అర్జీదారులు తమ తమ సమస్యలను రాతపూర్వకంగా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు లకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి నిబంధనలకు లోబడి పరిష్కార మార్గాలు పూర్తిస్థాయిలో చూపాలని స్పష్టం చేశారు. మరలా అర్జీలు రీ ఓపెన్ కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. గడువు దాటిన అర్జీలు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అందిన అర్జీలలో భూ సమస్యలు, పథకాల లబ్ధి చేకూర లేదంటూ ఎక్కువ స్థాయిలో దరఖాస్తులు అందాయన్నారు. ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పకు చెందిన వాతాడి వెంకటలక్ష్మి తాను పి.నరసింహ స్వామి అతని వల్ల మోసపోయానని తనకు న్యాయం చేకూర్చాలని ఆమె జిల్లా జాయింట్ కలెక్టర్ వారిని అభ్యర్థించారు. మానవ హక్కుల వేదిక ప్రతినిధులు సఖినేటిపల్లి మండలంలో ఓ ఎన్ జి సి అధికారులు ప్రతిపాదించిన బోరుబావులుపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వాటిని నిలుపుదల చేయాలని అర్జీని జాయింట్ కలెక్టర్ గారికి సమర్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు గత మూడు మాసాలుగా జీతభత్యాలు అందటం లేదని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం సరఫరా చేస్తున్న యూనిఫాంలు ఉపయోగకరంగా ఉన్నాయని వీటిని మరల మార్చవద్దని వారు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి అర్జీని సమర్పించారు. అందిన అర్జీలను ఆయా శాఖలకు నివేదించి విచారణ పూర్తయిన పిమ్మట నిబంధనలకు అనుగుణంగా తగు పరిష్కార మార్గాలు చూపడం జరుగుతుందని, ప్రస్తుతం అధికార యంత్రాంగం ఇచ్చే రసీదులు తీసుకుని వెళ్లాలని జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్. సత్తిబాబు, ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ ఇ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్. ఇ చంటి బాబు, గృహనిర్మాణ సంస్థ పిడి టి. రాజేంద్ర, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఆర్. తనూజ, జిల్లా పౌరసరఫరాల అధికారి కె వి ఎస్ ఎం ప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్. విక్టర్, డి సి హెచ్ ఎస్ పద్మ శ్రీ రాణి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి రవి సాగర్ , జిల్లా సహకార అధికారి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ జెడి సంకురియ్య, డ్వామా పిడి ముఖలింగం, మత్స్య శాఖ జెడి ఎం శ్రీనివాసరావు, ట్రాన్స్కో ఈ ఈ ఎం.రవికుమార్, కళాశాల ఎడ్యుకేషన్ ఆర్జేడీ జె డి ఎస్ ఎస్ సుబ్రహ్మణ్యం, సహాయ లేబర్ కమిషనర్ ఎం. విజయ రాణి, శాఖలకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement