విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:
రామచంద్ర పురం రూరల్, విశ్వం వాయిస్ న్యూస్: ద్రాక్షరామ పంచాయతీకి ఎగ్గొట్టిన వేలం పాట డబ్బులను తిరిగి పంచాయతీకి జమ చేయాలని కోనసీమ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పలివెల రాజు డిమాండ్ చేశారు.
రామచంద్రపురం రూరల్ ద్రాక్షారామ గ్రామంలో సోమవారం మండల అధ్యక్షులు కె టి కృష్ణ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు కోనసీమ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పలివేల రాజు పాల్గొని మాట్లాడుతూ ద్రాక్షారామ లో పంచాయతీకి ప్రధాన ఆదాయం అయినటువంటి మార్కెట్ వేలంపాట ద్వారా పంచాయతీ బోర్డు కి రావలసిన నిధులను కొంతమంది రాజకీయ స్వార్ధపరులు వారి యొక్క అనుచరులతో వేలం పాట పాడించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ బోర్డు కి చేరనివ్వకుండా ఎగ్గోటడం వలన దాదాపు రెండు సంవత్సరాల కాలంలో ద్రాక్షరామ పంచాయతీకి సుమారు14 లక్షల రూపాయలు ఆదాయం రాజకీయ నాయకులు జేబులోని చేరిందని, వేలంపాట సమయంలో గ్యారెంటీగా పెట్టిన పత్రాలను మాయం చేయడం వలన వేలం పాట దారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నదని, దీనిపైన ఉన్నత అధికారులు సమగ్రత విచారణ చేపట్టి పంచాయతీ బోర్డు కి కట్టవలసిన డబ్బులను కట్టించాలని, లేనిపక్షంలో దీనిపై భారతీయ జనతా పార్టీ తరఫున దీక్ష చేపడతామని ఎస్ సి మోర్చా అధ్యక్షులు పలివెల రాజు అన్నారు.