జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ,విశ్వం వాయిస్ః
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీల సత్వర పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలాక్కియా, డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ఎన్.వి.వి సత్యనారాయణ, బి.సి.కార్పొరేషన్ ఈడి ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి లతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్ధిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు సూచించారు. ఉద్యోగ, ఉపాధి, ఫించన్లు, గృహం మంజూరు, భూ వివాదాలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 221 మంది అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ స్పందనకు వచ్చిన ప్రతి అర్జీని ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసి, గడువులోపు అర్జీలను పరిష్కరించే విధంగా చూడాలని తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వికాస సంస్థ ఆధ్వర్యంలో వివిధ కంపెనీలలో ఉద్యోగంపొందిన అభ్యర్థులకు జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా, డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి చేతులు మీదుగా నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.