Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో బిజెపి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్తలు కృషి
చేయాలి
– బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ ,విశ్వం వాయిస్ః

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బలపడుతుందని, ఈదశలో ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా శక్తి కేంద్రాల ముఖ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పాల్గొని మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర పర్యటన విజయవంతం చేయడానికి బిజెపి శ్రేణులు నడుం బిగించాలన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే మనం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మోర్చా కమిటీలు పూర్తిగా నియమించాలన్నారు.
మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయడం లేదని, కేవలం రీసైక్లింగ్ చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఈకుంభకోణంలో పాత్రధారులను జైలుకు పంపించేద్దామన్నారు.
బిజెపి అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్ళు కట్టి ఇస్తామని,కోటి కుటుంబాలకు సోనామసూరి రేషన్ బియ్యం ఇస్తామని తెలిపారు.
రైతుకు ధాన్యం గిట్టుబాటు ధర చెల్లిస్తామన్నారు. బహిరంగ మార్కెట్ లో బియ్యం ధర నియంత్రణ చేస్తామన్నారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రశివన్నారాయణ మాట్లాడుతూ ప్రజల్లో బిజెపి పై విశ్వాసం పెరిగిందని, ప్రజల తో మమేకం కావాలన్నారు.
కోర్ కమిటీ సభ్యురాలు రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ 18మండలాల్లో పర్యటన చేయడం జరిగిందని, నాయకులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. అప్పుడే పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలపడుతుందన్నారు. జాతీయ అధ్యక్షుడు సభలో పాల్గొనే అవకాశం పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు మాట్లాడే అవకాశం కలుగుతుందన్నారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ అధ్యక్షత వహించిగా
బిజెపి నేతలు
ముత్తానవీన్ ,మాలంకొండయ్య ,గట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement