విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్)
ఎటువంటి మౌలిక వసతులు కల్పించలేని స్థలంలో ఇళ్లు ఎలా నిర్మించికోవాలో తెలపాలని కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామస్తులు అంటున్నారు. గత టీడిపి హయాంలో కాలేరు గ్రామంలో 158మంది అన్ని సామాజిక వర్గాలు వారికి ఇండ్ల స్థలాలు కేటాయించారన్నారు.కానీ నేటికి ఆ స్థలంలో విద్యుత్ సౌకర్యం, రహదారి సౌకర్యం, డ్రెయినేజీ లు నిర్మాణము చేపట్టలేదని స్థల లబ్దిదారులు వాపోయారు. ఇప్పటి వరకూ ఇళ్లు నిర్మాణం చేపట్టిని కారణంగా మీ పట్టాలు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని స్థానిక తహసీల్దార్ చిన్నా రావు తమకు నోటీసు లు జారీ చెయ్యడం దారుణం అని వారు ఆవేదన చెందుచు న్నారు. మాకు ఆ లేఅవుట్ లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం వారు ఇళ్ల నిర్మాణం నకు ఆర్ధిక సహకారం చేస్తే ఇళ్లు నిర్మాణ0 చేపట్టతామన్నారు.