విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )
అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూ సర్వే నిర్వహించి భవిష్యత్ లో భూ వివాదాలకు తావులేకుండా భూ రికార్డులు స్వచ్చికరణ చేయాలని భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.సాయి ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఆయన వెలగపూడి నుండి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష, సమగ్ర భూ సర్వే కార్యక్రమంలో భాగంగా ఫ్లయింగ్ డ్రోన్స్, గ్రౌండ్ ట్రూథింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్, భూ రికార్డుల స్వచ్చికరణ, సరిహద్దు రాళ్లు అమరికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశ లక్ష్యాలకు అనుగుణంగా సర్వేను చేపట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడుగడుగునా భూ యజమానులను భాగస్వామ్యం చేస్తూ పారదర్శకంగా రీ సర్వే చేసి భవిష్యత్ లో భూ వివాదాలకు తావులేకుండా చర్యలు గైకొనాలన్నారు. సర్వే ఆఫ్ ఇండియా సంస్థ సహకారంతో డ్రోన్స్, రోవర్స్, జిపిఎస్ వంటి సాంకేతికతను వినియోగించడం వల్ల భూముల స్థితిగతులపై స్పష్టత రానుందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన వంద ఏళ్ళు తరువాత ప్రస్తుతం ఆధునిక సమగ్ర సర్వే చేపట్టడం జరిగిందన్నారు. సర్వేలో వివిధ దశల్లో జిల్లాల వారీగా ఎన్ని గ్రామాల్లో లక్ష్యాలు సాధించారు ఎన్ని గ్రామాల్లో పెండింగ్ లో ఉన్నాయనేది కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ లో ఆస్తుల లావాదేవీలు గ్రామాల్లోనే చేసుకొనే విధంగా రిజిస్ట్రేషన్ సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు. భూములకు సంబంధించి ట్యా0పరింగ్ జరుగుతొందన్న ఫిర్యాదులు ఉత్పన్నం కాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ద్వారా ఆశించిన విధంగా లాభం జరగలేదని భూములకు చెందిన హద్దులు, హక్కులు ఇప్పటి వరకు లేవని భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఈ సర్వే ఉపకరిస్తుందన్నారు. కేవలం 90 శాతం కేసులు భూములకు సంబందించిన కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయని వాటిని తగ్గించడానికి ఈ సర్వే దోహదపడుతుందన్నారు. సర్వే ద్వారా భూములకు నిర్దిష్టమైన మార్పులు చేసి ప్రతి ఒక్కరికి ఐడేంటిఫికేషన్ నెంబర్ ఇస్తే భూ వివాదాలకు చెక్ పెట్టవచ్చాన్నారు. 2023 నాటికల్లా సర్వే పూర్తి చేసి యూనిక్ కార్డు డేటాతో ఆఫ్డేట్ ఇస్తామన్నారు. దేశంలో మరెక్కడాలేని ఎవరు సవాలు చేయలేని ఆస్థి హక్కును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, డిఆర్వో సిహెచ్ సత్తిబాబు, కలెక్టరేట్ ఏవో విశ్వేశ్వరావు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.