విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
వి.అర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్)
19;- పాలక ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలేస్తు, తమ పబ్బం గడుపుకుంటున్నాయని, ఫలితంగా గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ప్రజా ఉద్యమాలను ఉదృతం చేస్తామని, సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యాదర్శి బొప్పిన కిరణ్ స్పష్టం చేశారు. గురువారం పుచ్చలపల్లి సుందరయ్య 37.వ వర్దంతి వేడుకలను మండల కేంద్రం వి. ఆర్. పురంలో సుందరయ్య స్థూపం వద్ద జెండా ఆవిష్కరణ చేసి సుందరయ్యకు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం స్దానిక సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా నాయకులు సోయం చిన్నబాబు అద్యక్షతన బహిరంగ అధ్యయన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కిరణ్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల మద్యనే ఉంటు, ప్రజా సమశ్యల పై పోరాటాలు చేసి అసువులు బాసిన అమర వీరులను స్పూర్తిగా తీసుకొని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రల సహాకారంతో, గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం కోసం పాటుపడాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా సిపిఎం ప్రజా ఉద్యమాలకు ఆకర్శితులై పార్టి ప్రజా సంఘాలు, ప్రాధమిక సభ్యత్వం పొందిన కార్యాకర్తలకు పార్టీ విధి, విధానాలు, ప్రాజా సమశ్యల పట్ల స్పందించాల్సిన తీరు తెన్నెలపై అవగాహన కల్పించి, ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమంలో సి.పి.యం జిల్లా కమిటీ సభ్యులు పూనెం.సత్యనారాయణ,మండల కార్యదర్శివర్గ సభ్యులు పంకు.సత్తిబాబు,ఎం.పి.పి కారం.లక్ష్మీ,మండల కమిటీ సభ్యులు పులి.సంతోష్ కుమార్,తోడం.రాజు,గూటల.శ్రీనివాసరావు,పొడియం.శ్రీరామూర్తి,కుంజ.నాగిరెడ్డి,వడ్లది.రమేష్,కారం.సుందరయ్య,సున్నం.పార్వతిలు, చిన్నమట్టపల్లి ఎం.పి.టి.సి పూనెం.ప్రదీప్ కుమార్,పి.ఎం పల్లి సర్పంచ్ వెట్టి.లక్ష్మి, రామవరం సర్పంచ్ కారం.బుచ్చమ్మ, కారం.సత్తిబాబు,కమ్మచిచ్చు.సత్యనారాయణ,పులి.ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.