ధన్యవాదములు.
– సంతోషం వ్యక్తం చేసిన మండల వైసీపీ బృందం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
– యం యల్ సి ఆనంతబాబు, యం యల్ ఏ ధనలక్ష్మిన్ము
వి.అర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్)
19;- మండలానికి చెందిన వైసిపి పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా యం యల్ సి అనంత ఉదయ భాస్కర్( బాబు) , నియోజక వర్గ యం యల్ ఏ నాగుల పల్లి ధనలక్ష్మి తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు వైసిపి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఇందుకు ముత్యాల శ్రీనివాస్ మంచి ఉదాహరణ అని వారు పేర్కొన్నారు. పార్టీ జెండాను మొదటి నుండి మోస్తూ అధికారంలో లేకపోయినప్పటికీ ఇతర పార్టీల నాయకుల మధ్య ఎన్నో వడిదుడుకులు మోస్తూ వైసిపి భాజ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకొని కార్యకర్తలను తయారు చేసిన నాయకుల్లో మండలానికి చెందిన ముత్యాల శ్రీనివాస్ ఒకరని స్థానిక నాయకులు సైతం అంటున్నారు. శ్రీనివాస్ లా పనిచేసిన మండల నాయకులను జిల్లా యం యల్సీ అనంత ఉదయ భాస్కర్, యం యల్ ఏ నాగులపల్లి ధనలక్ష్మి ప్రతి ఒక్కరినీ గుర్తించారని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రధానమైన పాత్ర పోషించి పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు వెళ్లేలా అందరూ కృషి చేయాలని కోరారు.
* యంఎల్సీ, యం యల్యే ఏ కు కృతజ్ఞతలు
పార్టీని నమ్ముకొని పని చేసినందుకు యం యల్సీ అనంత ఉదయ భాస్కర్, యం యల్ ఏ ధనలక్ష్మి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ముత్యాల శ్రీనివాస్ మీడియా సమక్షంలో తెలియ పరిచారు. యం యల్సీ, యం యల్ ఏ నాపై పెట్టిన భాజ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ రైతుల సమస్యలపై పరిస్కార దిశగా ముందుకు వెళ్తానని అన్నారు. మూత్యాల శ్రీనివాస్ ని వ్యవసాయ సలహా మండలి సభ్యులుగా జిల్లాలో మండలానికి చెందిన వ్యక్తిని ఎన్నుకున్నందుకు అనంత బాబు, యం యల్ ఏ ధనలక్ష్మి కి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నట్లు మండల వైసిపి నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.