Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 26, 2024 12:09 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 26, 2024 12:09 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 26, 2024 12:09 AM
Follow Us

వైసిపి ఆడే ఆటా””జిల్లా తో జగనన్న వేటా””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* వైసీపీ ప్రభుత్వం గడపగడపకు గండం నుండి
గట్టెక్కించడానికే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారు*"
ఇది జిల్లా ప్రజల చారిత్రాత్మక విజయం*

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

పరావులపాలెం (విశ్వం వాయిస్ న్యూస్)

కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాసా బత్తుల ఆనంద రావు మాట్లాడుతూ,

వైసీపీ ప్రభుత్వం గడపగడపకు గండంనుండిగట్టెక్కడానికేకోనసీమజిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని, అధికారం చేపట్టిన మూడేళ్ల తర్వాత, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు గడపగడపకు ప్ర భుత్వం పేరుతో గ్రామ గ్రామం లో ప్రజల నుండి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారని, కోనసిమ జిల్లాను డాక్టరు అంబేద్కర్ కోనసిమ జిల్లాగా నామకరణం చేయాలని ఈ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతోకోరారని,ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కోనసీమ ప్రాంతంలో ఈ ప్రజా ప్రతిఘటన మరింత తీవ్రంగా ఉంటుందని భావించి, ఈ గండం నుండి గట్టెక్కడానికి మాత్రమే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని, అంబేద్కర్ మీద, దళితుల మీద ప్రేమతో కాదని, ఆనంద రావు ఆరోపించారు.జిల్లాల విభజన సందర్భంలో అంబే ద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని కోనసీమ వ్యాప్తంగా దళితులు, అనేక ఉద్యమాలు, దీక్షలు చేపట్టి ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారని, కొంత మంది దళితులు తమ పదవులకు రాజీనామాలు కూడా సమర్పిం చారని . అంతేకాకుండా కోనసీ మ స్థాయిలో అమలాపురంలో కని వినీ ఎరుగని రీతిలో లాంగ్ మార్చ్ నిర్వహించారని, చల నం లేని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ, దళితుల ఆత్మాభిమానాన్నిగౌరవించలేదనీ, నేడు ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళుతున్న ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న నిరసనలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో, దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం దిగివచ్చి అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లాకు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బా బునాయుడు తాళ్ల రేవు పర్య టనలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కోనసీమ అంబే ద్కర్ జిల్లాగా నామకరణం చేస్తామని ప్రకటించారని,

దళితులు పొందుతున్న 27 రకాల ప్రయోజనాలను రద్దు చేసి, దళితుల నడ్డి విరిచిం దని, జగన్ రెడ్డి ప్రభుత్వంపై దళితులకు ఇప్పటికే కనువిప్పు కలిగిందని, జగన్ రెడ్డి ప్రభు త్వాన్ని ఇంటికి సాగనంపడానికి నిర్ణయించుకున్నారని, అంబే ద్కర్ జిల్లా సాధించడంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏమీ లేదని, కేవలం ఇది దళితులు, అంబే ద్కరీయుల పోరాట ఫలితం అంబేద్కర్ జిల్లా దళితులు పోరాడి అహంకార అధికార పార్టీ మెడలు వంచి సాధించు కున్న చారిత్రాత్మక విజయం అనడంలో సందేహం లేదని, . కొత్తపేట నియోజకవర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు మండలాలలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలన్న ఆందోళనలలో తెలుగు దేశం పార్టీ అగ్రభాగాన నిలిచిందని . మద్దతు తెలిపిన టీడీపీ జాతీ య అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి, పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావుకి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆనందరావు తెలియజేశారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement