వ్యవహరించాలి
టిడిపి నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి దానిని ప్రమాదంలో మృతి చెందినట్లుగా చూపిస్తున్న ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు నిజనిర్ధారణ
కమిటీ కాకినాడకు వచ్చింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ
ఈ హత్యకు కారకుడైనా మొదటి ముద్దాయి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అధికార పార్టీ రాజకీయ వత్తిడులతో కేసును నీరు కార్చే విధంగా ప్రయత్నిస్తున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు. పోలీసులకు చిత్త శుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనీ, అలాగే ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది.
అనంతరం స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి గవర్నమెంట్ ఆసుపత్రి మార్చురీ వైపుకి ర్యాలీగా వెళ్లగా పోలీసులకి కార్యకర్తలు మధ్య తోపులాటలో నిజానిర్థారణ కమిటీలో సభ్యుడు ఎంఎస్ రాజుకి గాయాలవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు, పీతల సుజాత మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, పిల్లి మాణిక్యాలరావు, మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర్రావు , రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కాకినాడ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ తెలుగుదేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సుంకర పావని, రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని భాధ్యతగా కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.