Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

* జనసేన పార్టీ ఆధ్వర్యంలో””ఎమ్మెల్సీ అనంతబాబు దిష్టిబొమ్మ దగ్ధం *

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రంపచోడవరం:

 

( విశ్వం వాయిస్ న్యూస్)

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, చింతూరు మండల కేంద్రంలోని మన్యం అమరవీరుల విగ్రహాల కూడలి వద్ద ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అనంత బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

మొదటగా చింతూరు పోలీస్ స్టేషన్ నుండి దిష్టిబొమ్మను ఊరేగింపుగా అంబేద్కర్ ఇందిరా రాజీవ్ సెంటర్ ల మీదుగా వెళ్లి అనంతరం కూడలి వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు రవి మాట్లాడుతూ ఏజెన్సీ లో అనంత బాబు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని. మన్యంలో మాఫియా డాన్ గా చలామణి అవుతున్నాడు అని, అనంత బాబు వద్ద వీధి సుబ్రహ్మణ్యం అనే డ్రైవరు గతంలో పనిచేసిన ఈ క్రమంలో అనంత బాబు కీలక విషయాలు డ్రైవర్ కు తెలిసి ఉన్నాయన్న నేపథ్యంలో అనంత బాబు పుట్టినరోజు సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కాకినాడ బీచ్ కు తీసుకువెళ్లి కొట్టి హత్య చేసినట్లుగా బయట కుటుంబీకులు ఆరోపించడం జరిగిందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి అనంత బాబు ను అరెస్ట్ చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ హత్య పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన గౌరవ నాయకులు పయ్యావుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కోటం గణేష్, ఆనంద పెద్ద, రవికుమార్, వేడి సతీష్, మంత్రి అజయ్,కళ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement