విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట(అంబేద్కర్ కోనసీమ జిల్లా):-
దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం దారుణ హత్య కు నిరసనగా సోమవారం మండపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ సి సెల్ ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కేసులో దోషులైన ఎమ్మెల్సీ ఆనంతబాబుని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.బాధితులకు ప్రభుత్వం తరపున వెంటనే సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ సి సెల్ అధ్యక్షులు మందపల్లి దొరబాబు, రాష్ట్ర ఎస్ సి సెల్ కార్యదర్శి యార్లగడ్డ జాన్ సుందర్రాజు, దళిత రత్న వెంటపల్లి జాన్ మార్క్ , కోడి చిన అప్పారావు, పెందుర్తి ప్రదీప్ కుమార్,బడుగు రత్నంరాజు, వల్లూరి
దొరకయ్య, గంధం పవన్, గంధం రాజేష్, మోరాంపూడి విజయ్,తాతపూడి ఉగాది, నియోజకవర్గ ఎస్ సి సెల్ నాయకులు పాల్గొన్నారు.