Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వారం రోజుల్లో దళితులకు స్మశాన వాటిక…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆర్డీవో హామీతో నిరసన విరమణ..

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

మండపేట, విశ్వం వాయిస్ న్యూస్:

అర్తమూరు లో దళితుల స్మశానవాటిక అంశం ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామానికి చెందిన దళిత వృద్ధుడు మృతదేహంతో రెండు రోజులుగా స్మశాన వాటిక స్థలం చూపించాలని నిరసన చేస్తున్న దళితులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. మండపేట మండలం అర్తమూరు గ్రామంలో దళిత వృద్ధుడు రాముడు (80) మృతదేహంతో చేస్తున్న నిరసన రెండవ రోజుకు చేరుకుంది. అంత్యక్రియలకు చోటులేక 30 గంటల నుండి మృతదేహంతో దళితులు ఆందోళన చేపట్టారు. బుధవారం స్మశాన వాటిక స్థలం కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయం నుండి మండపేట రామచంద్రపురం మెయిన్ రోడ్డు లో అర్తమూరు తుపాకుల తూము దగ్గర అ మృతదేహంతో రోడ్డుపై బఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దళితులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మృతదేహంతో రోడ్డుపై ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఆర్డిఓ పివి సింధు సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలానికి చేరుకుని దళిత సంఘాల నేతలు గుమ్మడి అనిల్ కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దూళి జయరాజు, మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంటపల్లి జాన్ మార్కులతో నిరసన విరమించడానికి చర్చలు జరిపారు. వివరాల్లోకి వెళితే మంగళవారం అర్తమూరు లో ఓ వృద్ధుడు మృతి చెందగా ఆయన మృతదేహాన్ని కననం చేసేందుకు జాగా లేకపోవడంతో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచి ఆందోళనకు దిగినట్లు, అధికారులు చర్చలు జరిపిన ఫలితం లేకపోవడంతో బుధవారం మృతదేహాన్ని రామచంద్రపురం మండపేట ప్రధాన రహదారి తుపాకుల తూము ఉంచి పెద్ద సంఖ్యలో దళిత మహిళలు రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోవడంతో ఆర్డీవో ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం చెరువు గట్టు వద్ద మృతదేహానికి అంత్యక్రియలు చేయాలని, వారం రోజుల్లో ఇక్కడే దళితులకు స్మశానవాటిక కు సరిపడా స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దళిత మృతదేహాన్ని తో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా దళిత నేతలు మాట్లాడుతూ వారంలోగా సమస్య పరిష్కారం కాకుంటే తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా తాసిల్దార్ తంగెళ్ల రాజేశ్వర రావు, ఎంపీడీవో ఐదం రాజులు తీవ్ర కృషి చేసి నిరసనకారుల తో చర్చించారు. ఎట్టకేలకు వృద్ధుడి అంతక్రియలు పూర్తి చేసి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement