Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అమలాపురం ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలి జనసేన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

 

కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )

అమలాపురం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని జనసేన పార్టీ పేర్కొంది.స్థానిక నాగమల్లి తోట జంక్షన్ లోని గల హెలికాన్ టైమ్స్ లో పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పంతం నానాజీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ

కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు.

ఎమ్మెల్సీ అనంత బాబు కేసు సంఘటన తప్పుదోవ పట్టించడానికే అమలాపురంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అల్లర్లు సృష్టించారని ఆరోపించారు.

ఉదయం 500 మంది నిరసనకారులతో ఉన్న ర్యాలీ సాయంత్రానికి ఒక్కసారిగా 5 వేల మంది జనం ఎలా గుమిగూడారని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే కావాలని అమలాపురాన్ని రావణకాష్టంగా మార్చారన్నారు.

శాంతియుతంగా చేస్తున్న ఉద్యమం సాయంత్రానికి అల్లరి ముకాలను పెట్టి వైఎస్సార్ సీపీ పెద్దలు అల్లర్లు సృష్టించారని ఆరోపించారు.

అమలాపురం ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదన్నారు.

నిన్న జరిగిన సంఘటనలో జనసైనికులు ఎవరూ లేరన్నారు.ఎటువంటి దర్యాప్తు లేకుండానే అనంత బాబు చెప్పేదే జిల్లా ఎస్పీ చెప్పారని అన్నారు.

హత్య చేసిన హంతకుడికి జిల్లా పోలీసులు రాచ మర్యాదలు చేస్తున్నారన్నారు.

సుబ్రహ్మణ్యం కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు.

భారత రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ ను విస్మరించి ఎవరు ఏమి చేయలేరన్నారు.

తమ అధినేతకు భారత రాజ్యాంగం అన్న అంబేద్కర్ అన్న చాలా ఇష్టమన్నారు.

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో మా వైఖరి త్వరలోనే తెలియజేస్తామన్నారు.కార్యక్రమంలో పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్,తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, మేడా ప్రసాద్ పొలాసపల్లి సరోజా తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement