అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసాన్ని
ఖండించిన వామపక్ష పార్టీలు దళిత సంఘాలు ప్రజా
సంఘాలు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
డా.బి.ఆర్. అంబేద్కర్ జిల్లా అమలాపురంలో మంత్రి ఇల్లు, ముమ్మిడివరం ఎమ్మెల్యే ఇల్లు, ఆరు బస్సులను దగ్ధం చేయడాన్ని వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు కారకులైన విధ్వంస కారులను, కుట్రదారులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం కాకినాడ ఇంద్ర పాలెం లాకుల వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు శాంతియుత నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ విధ్వంసానికి కుల దురహంకారులు, ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బిజెపి వంటి మతోన్మాదుల కారణంగానే ఈ విధ్వంసం జరిగిందని ఆరోపించారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విచ్చిన్న కార్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ శాంతియుత నిరసన కార్యక్రమానికి కన్వీనర్లు జె. వెంకటేశ్వర్లు, ఏనుగుపల్లి కృష్ణ, గౌరవ అధ్యక్షులు అయితా బత్తుల రామేశ్వరరావు, గుడాల కృష్ణ, పిట్టా వరప్రసాద్, అయినారపు సూర్యనారాయణ, టీ. నూకరాజు, ఎం. రాజశేఖర్, డి శేష బాబ్జి, తోకల ప్రసాద్, తాళ్లూరి రాజు, పప్పు దుర్గా రమేష్, బామ్సెప్ కింగ్, చెంగల్ రావు, తాడి బాబ్జి, కాకిలేటి రవీంధ్ర (కిషోర్), హసన్ షరీఫ్, వీరబాబు, క్రిస్టఫర్, వల్లూరు సత్తిబాబు, రాజా, గంగ సూరిబాబు, సూర్య, మేడిశెట్టి వెంకట రమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, బి ఎస్ ఎన్. మూర్తి,బంగారు సత్యనారాయణ,మనోజ్, తదితరులు నాయకత్వం వహించారు.