వేదిక రాష్ట్ర స్థాయి వేసవి వినోద శిక్షణ తరగతులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ, మే 28; వైజ్ఞానిక స్పృహ కలిగిన సమాజ నిర్మాణం కోసం విద్యార్థి దశ నుండి శాస్త్రీయ దృక్పధాన్ని నేటి బాలలకు అలవర్చాలని ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యులు ఇళ్ళ వెంకటేశ్వర రావు(ఐ.వి.) పిలుపునిచ్చారు. జెవివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వినోదం రెండు రోజుల శిక్షణా తరగతులు శనివారం కాకినాడ యుటిఎఫ్ హోమ్ లో ప్రారంభమయ్యాయి. జనవిజ్ఞాన వేదిక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కె. ఎం.ఎం.ఆర్.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన శిక్షణా తరగతుల ప్రారంభం సభకు ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధాన అతిథిగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డా.చెలికాని స్టాలిన్ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేస్తూ జోయ్ ఫుల్ లెర్నింగ్ ద్వారా వినోదభరితంగా విజ్ఞానాన్ని పిల్లలకు అందించడంలో మూడున్నర దశాబ్దాలుగా జనవిజ్ఞానవేదిక కృషి చేస్తుందన్నారు.శాస్త్రీయ భావజాల వ్యాప్తికి జనవిజ్ఞానవేదిక కృషి బహుముఖమైనదని స్టాలిన్ అన్నారు. ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం, మూఢనమ్మకాల వ్యాప్తిని అరికట్టడంలోనూ,రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ ఆలోచన ప్రచారం చేయడంలో జెవివి క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ అన్నారు. విజ్ఞానం-వినోదం, వికాసం,ఏకాగ్రత పెంపుదల, చదువు పట్ల ఆసక్తి కలిగించే దిశగా వేసవి వినోదం చేస్తున్న కృషిని పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస కొనియాడారు.
వేసవి వినోదం ద్వారా పిల్లల్లో సృజనాత్మకత పెరిగిందని, ఆనందాభ్యసనం ద్వారా పిల్లల్లో చదువు పట్ల ఒత్తిడిని తగ్గించవచ్చు రాష్ట్ర నాయకులు కె. శ్రీనివాస్ అన్నారు.
వేసవి వినోదం రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు రెండు రోజులపాటు జరగనున్నాయనీ, మ్యాజిక్ షో, గణితంలో మెలకువలు, సృజనాత్మక కృత్యాలను, ఓరిగామి, చిట్టి సైన్స్ ప్రయోగాలు, కథలు, థియేటర్ ఆఫ్ ఆర్ట్స్, ఆస్ట్రానమీ అంశాలపై శిక్షణా తరగతులు ఉంటాయని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి రామారావు అన్నారు.
రిసోర్స్ పర్సన్ లుగా చిట్టితల్లి, బి.ఎం.గోపాల్ రెడ్డి, శివ నాగేశ్వరరావు,ఆనంద్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ ప్రారంభ సభలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్,జిల్లా నాయకులు వి.సత్యనారాయణ రెడ్డి, బి. అనంతరావు,సమత కన్వీనర్ మంగతాయారు,వర్మ ,కృష్ణ ,మల్లికార్జున రావు,కోశాధికారి బాలాజీ పాల్గొన్నారు.