Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,454,496
Total recovered
Updated on June 1, 2023 7:31 AM

ACTIVE

India
4,222
Total active cases
Updated on June 1, 2023 7:31 AM

DEATHS

India
531,870
Total deaths
Updated on June 1, 2023 7:31 AM

అనంతబాబు పై అసత్య ఆరోపణలు మానుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రంపచోడవరం:

 

ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్

: రంపచోడవరం నియోజకవర్గ నాయకునిగా కొనసాగిన ఎమ్మెల్సీ అనంత (బాబు) ఉదయ భాస్కర్ పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని వైకాపా రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గోసు ప్రశాంత్ , వైకాపా జిల్లా నాయకులు కురినాల వెంకట్ (బుజ్జి) హితవు పలికారు. మండల పరిధిలోని గన్నవరం గ్రామంలో వైకాపా రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు పసుపులేటి లక్ష్మణరావు అధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. డ్రైవర్ సుబ్రమణ్యం మృతి చెందిన నేపథ్యంలో ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడుతూ ఆటు పోట్లు అనేవి మనిషి జీవితంలో సహజమని ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరికి వచ్చినట్లు వారు తమ నాయకుడు అనంతబాబుపై ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో లేదో వారి అంతరాత్మకు తెలుసని అన్నారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని తప్పు చేస్తే చట్టం ఎవరినైనా శిక్షిస్తుందని అన్నారు. అనంతబాబుకి 4 మండలాల ఎస్సీ సెల్ నాయకులు , ప్రజలంతా తన వెంట అండగా ఉన్నారని పేర్కొన్నారు. అర్హత లేని వారు కూడా తమ నాయకుడిపై విమర్శలు చేయడం చాలా దారుణమని దుయ్యబట్టారు. అనంతబాబును విమర్శించే వాళ్ళు ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పార్టీ పగ్గాలు చేపడతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీలంటే అనంతబాబుకు అమితమైన ప్రేమ అని అన్నారు. ఏ రోజూ ఎస్సీ నాయకుల పట్ల వివక్ష చూపలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు మాచర్ల గంగులు , శివ , పల్లంటి ప్రకాష్ , పూస మురళి , వెంకటరావు , పాపారావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!