Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అమలాపురం విధ్వంసకర హింసాకాండకు వైసిపి ఆడే ఆట””జనసేన మాట

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చిత్తూరు:

 

చింతూరు – విశ్వం వాయిస్ న్యూస్ 28/52022

చింతూరు జనసేన పార్టీ

ఈరోజు చింతూరు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు మడివి రాజుగారు ఓ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే అమలాపురం లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చెలరేగిన విధ్వంసకర హింసాకాండకు దారితీసిన విషయం లో సాక్షాత్తు రాష్ట్ర హోం శాఖ మంత్రి గారు ఒక ప్రెస్ మీట్లో కనీసం ఎటువంటి ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఈ ఘటన వెనుక జనసేన పార్టీ ఉందనడం చాలా హాస్యాస్పదంగా ఉంది అది వారి విజ్ఞతకే తెలియాలని ఈ విషయంలో జనసేన పార్టీ పట్ల మీకు ఉన్న అక్కసును బయట పెట్టారు. ఈ సంఘటన విషయంలో కులాల మధ్య కుంపటి చిచ్చుపెట్టి అధికార పార్టీ చలి కాగాలని చూస్తోంది రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను కప్పిపుచ్చుకోవటం కోసం అందులోనూ ఈ మధ్య కాలంలోనే కాకినాడలో ఒక దళిత యువకుడి హత్య విషయంలో ఒక అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉండటం దానిని రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా మండిపడుతుండటం విషయాలను కప్పిపుచ్చుకోవటం కోసం అంబేద్కర్ కోనసీమ లో విధ్వంసకర దాడులను తమ సొంత పార్టీ కార్యకర్తలతో అధికార పార్టీ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ సంఘటన ముమ్మాటికి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చేయించిందని మడివి రాజు గారు తీవ్రంగా మండిపడ్డారు ఎందుకంటే రాష్ట్రంలో దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా వివక్షకు గురిచేస్తూ రాజ్యాంగబద్ధమైన దళితుల హక్కులను తుంగలో తొక్కుతూ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ సంఘటనలో కోనసీమ అమలాపురంలో ఉన్న దళితులందరూ జనసేన పార్టీ వైపు చూస్తున్నారనే నెపంతో అక్కసుతో విధ్వంసకాండకు వైఎస్సార్సీపీ పార్టీ తెర తీసిందని అక్కడున్న కోనసీమ సాధన సమితి పేరుతో అధ్యక్షులుగా మట్టపర్తి మురళీ కృష్ణగారు ఉన్నారు. ఈ హింసాకాండ అంతా కూడా వారి అధ్యక్షతన జరిగిందని ఆయన వైసిపి పార్టీ బీసీ సెల్ అధ్యక్షులుగా ఉన్నారని వారి ద్వారానే ఈ హింసాకాండకు దారి తీశారనేది రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైంది అని మడివి రాజు గారు పత్రికా ప్రకటనలో తెలిపారు ఈ హింసాకాండలో పూర్తిస్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆది దుర్గాప్రసాద్,చిలకం కన్నారావు,రాజు ,రమేష్,సుబ్బారావు ,సర్వేశ్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement