విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్):
ఈ ఏడాది ఖరీఫ్ లో స్వల్పకాలిక పంటలను అన్నదాతలు సాగు చేయాలని ఆలమూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఎడిఎ సిహెచ్ కేవి చౌదరి రైతులకు తెలిపారు. ఆలమూరు మండలం జొన్నాడ రైతు భరోసా కేంద్రంలో సోమవారం గ్రామ సర్పంచ్ కట్టా శ్రీనివాస్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సి.హెచ్. కాశీ విశ్వనాథ్ చౌదరి మాట్లాడుతూ ఈ యేడాది ఖరీఫ్ త్వరగా ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో జూన్ నెల మొదటి వారంలో కాలువలకు నీరు విడుదల చేస్తున్నారని, ఖరీఫ్ లో స్వల్పకాలిక పంట సాగు చేయడం వలన అక్టోబర్ 30వ తేదిలోగా సీజన్ పూర్తి అవుతుందని తెలిపారు. వెంటనే రబీ సీజన్ ప్రారంభించడం వలన తర్వాత యేడాది మార్చి ఆఖరు నాటికి సీజన్ పూర్తి అవుతుందని తెలిపారు. మార్చి ఆఖరకు రబీ సీజన్ పూర్తి అయితెే మూడవ పంటగా అపరాలు సాగు చేయుటవలన అదనపు ఆదాయం పొందవచ్చునని అన్నారు. అదనపు ఆదాయంతో పాటు అపరాలు సాగు వలన సహజసిద్దమైన నత్రజని భూమికి అందుతుందని తెలిపారు. పంట మార్పిడి విధానం అమలు వలన భూసారం పెరుగుతుందని, ప్రకృతి వ్యవసాయం పై అవగాహన రైతులుకు కల్పించడం జరిగిందిని సేంద్రీయ వ్యవసాయం వాడకం ద్వారా ఖర్చులు తగ్గి ఆరోగ్య కరమైన పంట ఉత్పత్తి అవుతుంది అన్నారు. ఖరీఫ్ కు కావలిసిన విత్తనాలు, ఎరువులు కావలసిన వారు ముందుగా గ్రామ రైతు భరోసా కేంద్రం వద్ద వివరాలు తెలపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నండ్రా నాగ మోహన్ రెడ్డి, వీఏఏ యస్వీ నరేష్ కుమార్, వీరి కృష్ణ, తాడి రామచంద్ర రెడ్డి, తాడి శ్రీనివాస్ రెడ్డి , రైతులు పలువురు పాల్గొన్నారు.