Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విజయవాడలో జూన్ 6న వికలాంగుల మహా ధర్నా…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:

వికలాంగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూన్ 6న విజయవాడలో వికలాంగుల మహా ధర్నా చేపడుతున్నామని ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకుడు ఏపీ ఇన్ ఛార్జ్ అందే రాంబాబు పేర్కొన్నారు. మండపేట దివ్యాంగుల భవనంలో మంగళవారం ఏర్పాటైన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మహాజన సోషలిస్టు పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్చార్జి దూలి జయరాజుతో కలిసి మాట్లాడారు. విజయవాడలో ధర్నాచౌక్ ప్రాంగణం వికలాంగుల మహా ధర్నాకు వేదిక కానుందన్నారు. బి హెచ్ పి ఎస్ వ్యవస్థాపకులు , మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగులకు పించన్ ను ఆరు వేల రూపాయలకు పెంచాలన్నారు. రాజ్యాధికారంలో వికలాంగులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. వికలాంగుల రక్షణకోసం అట్రాసిటీ చట్టం వర్తింప చేయాలన్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం వికలాంగులకు వివాహ ప్రోత్సాహ భృతి ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని కూడా తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సహకార సంస్థ ద్వారా తమకు మోటార్ వెహికల్స్ ను వెంటనే పంపిణీ చేయాలన్నారు.  తదితర 38 డిమాండ్ల సాధనకై జూన్ 6న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భారీ ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులు మెడిశెట్టి రాంబాబు, షేక్ నబీ, కాళిదాసు, వెంకటలక్ష్మి, నురికుర్తి లోవరాజు, ఎస్ చిన్నారావు, కుడుపూడి శ్రీను, మాదే బోయిన ప్రసన్న, మేడిద అబ్బులు, గొర్రెల లక్ష్మి, అనుసూరి విజయ్, సోమవారపు రాము, ఎమ్మెస్పీ నాయకుడు గాలింకి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement