విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )
కోత యంత్రాలుతో కోసిన వరి గడ్డిని రైతులు అవగాహన లోపంతో నిప్పు పెడుతున్నారు. దీని వలన భూమి కి అందాల్సిన సేంద్రీయ ఎరువు ఆహుతి అవడమే గాక చేలో మేలు చేసే క్రిములు, వాన పాములు బూడిద అవుతున్నాయి.కోత యంత్రాలు తో కోసిన వరిగడ్డి దమ్ము లో కుళ్ళి సేంద్రీయ ఎరువుగా మారి భూసారం పెరుగుతుందని వ్యవసాయ అధికారుల సూచనలూ రైతులు పెడచెవిన పెడుతున్నారు. దీనిపై రైతులను వివరణ కోరగా ఈ మధ్య కాలంలో చిన ట్రాక్టర్లు తోనే వరి సాగు భూములు దమ్ము చేస్తున్నారని అన్నారు. చేలలో మిగిలిన వరి గడ్డి చిన ట్రాక్టర్ చక్రాలకు చుట్టుకొని దమ్ము సాగుట లేదని రైతులు అంటున్నారు. గతంలో వలె పెద్ద ట్రాక్టర్లు తో దమ్ము చేస్తే చేలు లోతుగా దిగిపోయి రైతులు నడవలేని పరిస్థితి నెలకొంది అన్నారు. అంతేగాక వరి మూన వేరు విస్తరించరించదు అంటున్నారు. ఎంతో విలువైన ఎండుగడ్డిని యంత్రాల ద్వారా ఒబ్బిడి చేసి పేపర్ మిల్లు లకు సప్లయ్ చెయ్యడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.