Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** స్పందన ప్రజా విజ్ఞాపన కార్యక్రమం **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని ని:

 

తుని: మే6: విశ్వం వాయిస్ న్యూస్:

జిల్లా అధికారులు అంటే ప్రజల్లో నమ్మకం కలగాలంటే క్షేత్రస్థాయి సందర్శనలు ,తనిఖీలు చేయాలని, ఎవరైనా తప్పు చేస్తే పట్టుకుంటారని భయం కూడా వారిలో కలగాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణం లో స్థానిక సిద్ధార్థ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్పందన ప్రజా విజ్ఞాపన స్వీకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి జిల్లా అధికారులు ప్రజలకు దగ్గర కావాలని, క్షేత్రస్థాయిలో తరచూ తనిఖీలు నిర్వహిస్తే, ఇక్కడ కూడా జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నరూ,తప్పు చేస్తే పట్టుకుంటారని భయం ప్రజల్లో కలగాలని ఆమె సూచించారు. ఈ స్పందన కార్యక్రమం అనంతరం నేను కూడా మధ్యాహ్నం ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి తనిఖీలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.మీరు కూడా సంబంధిత సమస్యలతో ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యపై నాకు నివేదిక ఇవ్వాలని అని ఆమె అధికారులకు ఆదేశించారు. దానికి మీరు ఏమి ఇన్స్పెక్షన్ చేశారు, అక్కడ ఏమి కావాలి, దానికి ఏం పరిష్కారం సూచించారు కూడా తెలియజేయాలని ఆమె అన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రతి జిల్లా అధికారి తనిఖీలు అనంతరం అంతా బాగుంది, అన్నీ బాగానే జరుగుతున్నాయన్న రిపోర్టు అందించాలని అధికారులకు ఆదేశించారు.తుని,కోటనందూరు,తొండంగి మండలాల నుండి ప్రజలు స్పందన కార్యక్రమానికి అర్జీదారులు చేరుకుని తమ సమస్యలను కలెక్టర్ విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని ఆమె తెలియజేశారు.తునిపురపాలక సంఘం కో ఆప్షన్ సభ్యులు,నియోజక వర్గం యువత అధ్యక్షులు ఏలూరు బాలు, కలెక్టర్ కృత్తకా శుక్లను,జాయింట్ కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమానికి 80 శాఖల అధికారులు, సిబ్బంది, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు .వర్షం కారణంగా సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement