విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం విశ్వం వాయిస్ రిపోర్టర్,
మోటిపల్లి సత్తిబాబు గారి జన్మదిన సందర్భంగా హెచ్ఐవి/ ఎయిడ్స్ బాధిత చిన్నారులకు, మహిళలకు, సామాజిక పోషకాహార వితరణ కార్యక్రమం జరిగింది.
అమలాపురం ఈదర పల్లి హనుమాన్ థియేటర్ రోడ్డు నందు వి. పి. సి. థియేటర్ రెండవ గేట్ ఎదురుగా ఉన్న జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ అమలాపురం ఆఫీసు నందు హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత చిన్నారులకు మహిళలకు పేరూరి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఎమ్ ఎస్ ఎన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మోటుపల్లి సత్తిబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని 25 మంది హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ బాధితులకు పోషకాహారాన్ని అమలాపురం డి. బి. ఆర్. సి .కౌన్సిలర్ జి.కవిత గారి అధ్యక్షతన వితరణ చెయ్యటం జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జన కళ్యాణ్ టి. ఐ. ప్రాజెక్టు మేనేజర్ జి.శ్రీను మాట్లాడుతూ 2005 నుండి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు పోషకాహారం పంపిణీ కౌన్సిలింగ్ రిఫర ర్ సేవలు అందిస్తూ పనిచేస్తుంది అని 2009 నుండి ఈ సంస్థలకు ఆర్థిక పరమైన నిధులు నిలిచిపోవడంతో సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది దాతల నుండి వివరాలు సేకరించి బాధితులకు పోషకాహారాన్ని వితరణ ఇవ్వడం జరుగుతుంది, అమలాపురంలో హెచ్.ఐ.వి ఎయిడ్స్ బాధితులకు పోషకాహారాన్ని అందించే వ్యక్తులు యొక్క ఆవశ్యత ఎంతో ఉందని సత్తిబాబు గారి లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి ఉదారంగా హెచ్ఐవి/ ఎయిడ్స్ బాధిత చిన్నారులకు, మహిళలకు, వ్యక్తులకు, అవసరమగు విద్య వైద్యం పోషకాహారం అందించాలని కోరడం జరిగింది.
ఎం .ఎస్ .ఎన్. చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు , వ్యాపారవేత్త ఆయన మోటుపల్లి సత్తిబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కచ్చితంగా అధికముగా హెచ్ ఐ వి/ ఎయిడ్స్ బాధితుల కు పోషకాహారం వితరణ ఇవ్వటానికి నా శ్రమ శక్తుల ప్రయత్నం చేస్తాను అని సభ ముఖముగా హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎస్సీ సెల్ నాయకులు గొల్లపల్లి గోపి, అమలాపురం ఏరియా ఆసుపత్రి డి. ఎస్. ఆర్.
సి. కౌన్సిలర్ జి. కవిత, జన కళ్యాణ్ సిబ్బంది, పీర్ ఎడ్యుకేటర్ స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోషక ఆహారాన్ని దాతల నుండి సేకరించిన ఫిర్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల ను మేనేజర్ జి. శ్రీను అభినందించడం జరిగింది.