విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:
తొండంగి: మే 7: విశ్వం వాయిస్ న్యూస్:
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలో ఎన్టీఆర్ కొత్త కాలనీలో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత ఉప ప్రధాని మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ అధ్యక్షుడు పెదపూడి ఏసుబాబు మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ అ, కాకినాడ జిల్లా కో కన్వీనర్ తోమ్మండ్ర హేమంత్ మాదిగ పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్న సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ శ్రీకాకుళం నుండి మాదిగల సంగ్రామ పాదయాత్ర జాతీయ ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ
ఆధ్వర్యంలో జూలై 27 వరకు గుంటూరుకు చేరుకునేలా 88 నియోజకవర్గాల పాదయాత్ర ప్రారంభించారు. దానికి అనుగుణంగా తూర్పు ఉమ్మడి గోదావరి మూడు జిల్లాల మండల నియోజకవర్గ జిల్లాల హెడ్ క్వార్టర్ ల వరకు పాదయాత్రలు కొనసాగే విధంగా కాకినాడ జిల్లా నూతన కన్వీనర్ తోమ్మండ్ర హేమంత్ మాదిగను గ్రామ కమిటీలు మండల కమిటీలను ఏర్పరుచుకుంటే పాదయాత్రగా వచ్చే జాతీయ నాయకులు నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమిటీలను ప్రకటించుదురు అని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా కన్వీనర్ తోమ్మండ్ర హేమంత్ మాదిగ మాట్లాడుతూ తుని నుండి కాకినాడ జిల్లా శివారు పెద్దాపురం నియోజవర్గం గండేపల్లి మండలం రామేశ్వరం పేట వరకు సాగే పాదయాత్రలో అన్ని గ్రామాల మండల నియోజకవర్గాలలో ఉన్న మాదిగ డిగ్రీ, పిజి, ఇంటర్ విద్యార్థులను నూతన నూతన ఎమ్మార్పీఎస్ కమిటీకి ఆహ్వానిస్తూ ఇన్చార్జి లను, కో-ఇంచార్జ్ లను తొందర్లోనే నిర్మించడం జరుగుతుందని తెలియపరిచారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కింతాడ చిలకయ్య మాదిగ,కండవల్లి తాతబ్బాయి మాదిగ,మరియు పెదపూడి శరబాబు, కింతాడ విజయ్, సిద్ధాంతపు కిరణ్, మాజీ ఎమ్మార్పీఎస్ నియోజవర్గ నాయకుడు కింతాడ సత్తిబాబు, గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ కింతాడ ఏసేపు తదితరులు పాల్గొన్నారు.