విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )
ఆధునిక యంత్రాల తో రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఎప్పుడూ ఉంటుందని…వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా రైతులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మేలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం లో భాగంగా అంబాజీపేట ఏఎంసి ఆవరణలో రాయితీ పై యంత్ర పరికరాలును రైతులకు పంపిణీ చేశారు.అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని మెరుగుపరిచేందుకే యంత్ర సేవ అని అన్నారు. విత్తనం నుంచి వంట విక్రం వరకు వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పి. గన్నవరం
నియోజకవర్గంలో 4 మండలాల్లో సబ్సిడీతో కూడిన యంత్రాలను పంపిణీ చేశారు. ట్రాక్టర్లు , వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు సబ్సిటి ధరకు అందచేసిన్నట్లు ఆయన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు .రైతులకు రాయితీ ఎరువులు, విత్తనాలు ,ఆధునిక యంత్ర పరికరాలు, సాగు సలహాలు, భూసార పరీక్షలు వంటివి రైతులకు అందుబాటు లోకి తెచ్చే సదుద్దేశ్యంతోనే గ్రామ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అలాగే ఏ పంట కాలంలో నష్టం జరిగినా ఆ పంట కాలంలోనే నేరుగా రైతు ఖాతాలో నష్ట పరిహారం ను జమ చేస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షులు వాసంశెట్టి చినబాబు,
ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ నేతల నాగరాజు , అంబాజీపేట పిఎసిఎస్ చైర్పర్సన్ కొర్లపాటి కోట బాబు, అయినవిల్లి జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు, అయినవిల్లి ఎంపీపీ మట్టపర్తి విజయలక్ష్మి వెంకటరమణ , వ్యవసాయ అధికారులు సి హెచ్ డి విజయ్ కుమార్, జి కుమార్ బాబు, డి.సి.సి.బి బ్యాంకు అంబాజీపేట మేనేజర్ పి. శ్రీనివాసరావు,
డి.సి.సి.బి బ్యాంకు సూపర్వైజర్ వి. ప్రదీప్, ఏ ఈ ఓ డి. దుర్గారావు, వి ఏ ఏ లు, బి హెచ్ ఎల్ రైతులు , వైకాపా నాయకులు పాల్గొన్నారు.