విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
వి.ఆర్.పురం ( విశ్వం వాయిస్ న్యూస్) 12;-
మండలంలోని రేఖపల్లి గ్రామ శివారులో నాయకపోడు గిరిజనులు జరుపుతున్న జాతరలో శివగిరి శ్రీనివాస్, గంగ భవాని దంపతులు తమ సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సంధర్బంగా దాతలు శివగిరి శ్రీనివాసరావు, గంగాభవని దంపతులు మాట్లాడుతూ ఈ వన దేవతల జాతర వలన ఎన్నో గిరిజన, గిరిజనేతర కుటుంబాలు అమ్మవారి ఆశీస్సులతో ఎన్నో మంచి పనులు కు పాత్రులవుతున్నారని , ఈ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం వలన జాతరను తిలకించడానికి వచ్చిన భక్తులు ఆ కుటుంబ సభ్యులకు మంచి ఆహారం అందించ గల్గిన్నారని అన్నారు. అన్నదానం చేసిన శ్రీనివాస్, భవాని దంపతులకు వచ్చిన జనం, భక్తులు ప్రత్యేక ధన్యవాదములు తెలియ పరిచారు. .సుమారు 700 మంది భక్తులకు భోజనం ఏర్పాటు చెయ్యటమైనది వందలాది మంది భకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు చిక్కాల బాలు,కొల్లుబోయన రమణయ్య, పట్ల సీతయ్య, ముత్యాల అప్పన్న బాబు,రేవు నాగేశ్వరరావు, బేతి సారయ్య, బేతి నాగేశ్వరరావు, ముత్యాల పులిరాజు తదితరులు పాల్గొన్నారు.