విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :
మండలంలో ఇటీవల బండిరేవు గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును పొదల మాటున విడిచి పెట్టారు. సమాచారం అందుకున్న స్ధానిక ఐసీడీఎస్ సిబ్బంది మనీశ్వరీ ఘటనా స్థలానికి చేరుకొని శిశువును వైద్యం నిమిత్తం స్థానికంగా ఉన్న లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం ఎటపాక పోలీస్ స్టేషన్లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. తదుపరి మగ శిశువును శుక్రవారం కాకినాడలోని శిశు గృహనికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్ వెంకటలక్ష్మీ , సిబ్బంది మనీశ్వరీ , వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.