విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )
విధి నిర్వహణలో భాగంగా ఉపాధి హామీ ఉపాధి హామీ పథకం లోని పనులు కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరులను అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఫోటోలు తీసి భయపెడుతున్న అరుదైన సంఘటన అంబాజీపేట మండలం మొసలపల్లి లో తీవ్ర చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే అంబాజీపేట మండలం మొసలిపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు.విధినిర్వహణలో భాగంగా శనివారం మధ్యాహ్నం మొసలపల్లి లోని జగ్గన్నతోట తీర్థం జరిగే ప్రాంతంలో కౌశిక లో ఉపాధి పనులు చేస్తున్న సందర్భంగా అక్కడి ఫోటోలు తీసుకొని విలేకరులు వెనుదిరిగారు. అంతలో అక్కడికి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ నేదునూరి సుజాత వెళ్ళిపోతున్న విలేకరులను వెనకనుండి ఫోటోలు తీయడం తో అది గమనించిన ఒక పత్రికా విలేఖరి మమ్మల్ని ఎందుకు ఫోటోలు తీస్తున్నారు అని అడగగా నేను ఎవరికో పంపించు కోవాలి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు ఇక్కడ పని ఏంటి అంటూ విలేకరులతో అనవసర వాగ్వివాదానికి దిగింది.అక్కడ ఉన్న ఉపాధి కూలీలకు సైతం ఫీల్డ్ అసిస్టెంట్ తీరును చూసి నిర్ఘాంతపోయారు. ఇదిలా ఉండగా గత మూడు రోజుల క్రితం మొసలి పల్లి పంచాయతీ వద్ద చెరువులో ఉపాధి పనులు కవర్ చేసుకొని ఉపాధి కూలీలను ఎన్ని రోజుల నుండి పనులు చేస్తున్నారు ఎంత కూలి వస్తుంది అని వివరాలు అడిగి అక్కడి నుంచి వెళ్లి పోతున్న ఓ విలేకరిని సైతం ఫీల్డ్ అసిస్టెంట్ నేదునూరి సుజాత భర్త నేదునూరి శ్రీనివాసరావు ఆ విలేఖరి ని ఫోటోలు తీసి నీ సంగతి చూస్తాను వార్తలు తేడాగా రాస్తే అని బెదిరించిన సంఘటన పై ఇప్పటికే మూడు రోజుల క్రితం అంబాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా మరో విలేకరిని కూడా శనివారం ఫోటోలు తీసి బెదిరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.మొసలపల్లి లో ఫీల్డ్ అసిస్టెంట్ భర్త ఉపాధి కూలీల పై పెత్తనం చెలాయించడాన్ని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు.ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ భర్త ఆగడాలు మితిమీరిపోతున్నాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.