విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
స్థానిక లక్ష్మీ నారాయణ నగర్, ఆదిత్య డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి ఈ వి ఎల్ నాయుడు తెలిపారు.
ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహించారు.
ప్లాస్టిక్ రహిత సమాజం వైపు అడుగులు వేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలలో ప్రతి ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ పాల్గొనాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి వారిని సంరక్షించే చర్యలు చేపట్టారు. అదేవిధంగా కళాశాలలో ఉన్న ఎన్ ఎస్ ఎస్ వనంలో మొక్కల చుట్టూ శుభ్రపరచి , నీటి గుంతలను ఏర్పాటు చేశారు .
కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ బృందాన్ని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రెటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణా రెడ్డి,అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి ఈ వి ఎల్ నాయుడు అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ , ఇంచార్జ్ మూర్తి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు
టి తేజేశ్వరరావు, ఎల్ దివాకర రావు, మణికంఠ,ఫణి తేజ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.