విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
*కామన ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు*
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
మోడీ కుటిల రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు రాహుల్ గాంధీ నేతృత్వంలో లోని కాంగ్రెస్ పాలనను ప్రజలంతా కోరుకుంటున్నారని మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, ఏఐసీసీ సభ్యులు కామన ప్రభాకర్ రావు అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఏఐసిసిఅధ్యక్షులు రాహుల్ గాంధీ 52 వ జన్మదిన వేడుకలు కామన
ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పుట్టిన రోజు సందర్భంగా స్థానిక మయూరి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కామన మాట్లాడుతూ ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఒక్క రాహుల్ గాంధీ కుటుంబమేనని పేర్కొన్నారు. వారి నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ లు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ దేశం కోసం దేశ ప్రజల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన నాయకుడు కోసం ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు దేశ ప్రజలు కూడా అండగా ఉండాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆయన ప్రధాని పదవిని అధిష్టించి ఈ దేశ ప్రజలకు సేవ చేయాలని కామన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అప్పరబోతుదుర్గాప్రసాద్, నమ్మి అప్పారావు, ఎం సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.