Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– పెట్రోల్, డీజిల్, గ్యాస్,
– సిఐటియు ఆందోళన.. కంచాలు వాయిస్తూ నిరసన
– మోడీ ప్రభుత్వం కార్పొరేటర్ల సేవలు ఆపి సామాన్యుల
ఆకలి తీర్చాలని డిమాండ్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ,విశ్వం వాయిస్ః

కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు చేస్తున్న సేవలు ఆపి సామాన్యుల ఆకలి తీర్చాలని సిఐటియు డిమాండ్ చేసింది.

ఆదివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ లో కంచాలు వాయిస్తూ వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ లు మాట్లాడుతూ మోడీ పాలనలో కార్మిక, కర్షక, కష్టజీవుల ఆదాయాలు తప్ప అన్నీ పెరుగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014 లో 65 రూపాయలు గా ఉన్నా పెట్రోల్ నేడు 112 రూపాయలకు చేరిందన్నారు. 650 రూపాయలు గా ఉన్న వంటగ్యాస్ 1050 రూపాయలకు చేరిందని, గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసారని పేర్కొన్నారు. కరోనా కు ముందు 80 రూపాయలు గా ఉన్న పామాయిల్ ధర నేడు రెట్టింపు దాటిపోయిందన్నారు. ఆకలి సూచీలో భారతదేశం రోజురోజుకూ దిగజారిపోతున్నా ఘనత వహించిన మోడీయులకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. కనీస వేతనం 26,000/-రూ. అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా కేంద్ర పాలకులు కార్పొరేట్ ల సేవలు ఆపి సామాన్యుల ఆకలి తీర్చాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కె. సత్తిరాజు, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు లతో పాటు నాయకులు నాగాబత్తుల సూర్యనారాయణ, ఎం. రమణమ్మ, సిహెచ్. వేణు, కోనాడ ప్రకాశరావు, దుంపల ప్రసాద్, కె. అప్పారావు, రొంగల ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు…

 

*బ్రిటిష్ పాలన అమలు చేస్తున్న పోలీసుల వైఖరి పట్ల సిఐటియు ఖండన*

 

అధిక ధరలకు నిరసనగా కంచాలు వాయిస్తూ ఆందోళన చేస్తున్న సమయంలో 3 వ పట్టణ పోలీసు వారు వచ్చి ఇక్కడ ఆందోళన చేయడం తగదని, ధర్నాలకు అనుమతి లేదని మాట్లాడడం చూస్తుంటే ఎమర్జెన్సీ కంటే ఘోరంగా కాకినాడ లో పరిస్థితి ఉందని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. సాధారణ నిరసనలు కూడా చేయరాదని పోలీసులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిసరాలను నిషేధిత ప్రాంతంగా మార్చేసారని, ఇది బ్రిటిష్ పాలనను తలపిస్తోందని పేర్కొన్నారు. పోలీసు వారు రాజ్యాంగాన్ని గౌరవించాలని, పౌరుల నిరసన హక్కులను కాపాడాలని సిఐటియు నాయకులు హితవు పలికారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement