విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:
కరప( విశ్వం వాయిస్ న్యూస్..
కరప మండలం నడకుదురు గ్రామంలో వర్షం పడితే కాల్వలను తలపిస్తున్నాయి నడకుదురు మెయిన్ రోడ్. ఇక వివరాల్లోకి వెళితే మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి రోడ్డుకిరువైపులా వంటకాలు ఉండేవని అవి రాను రాను కాలక్రమేణా అవి చిన్న బోదులు గా ఉండేవని ఇప్పుడు వాటిని ఎవరింటి ముందు వారు మూసివేశారని దానివల్ల వర్షం పడితే ఆ వర్షం నీరు ఎటు వెళ్లే దారి లేదని అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కి గాని మెయిన్ రోడ్ కి అటూ ఇటూ ఉన్నటువంటి హౌస్లకుగాని డ్రైనేజీ లేక గత 20 సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి రోడ్డుకిరువైపులా డ్రైనేజీ ఇవ్వాలని ఆ డ్రైనేజి కి పంచాయతీకి ఆనుకుని ఉన్నటువంటి మెయిన్ డ్రైనేజీ లో కలపాలని. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ డ్రైనేజీ కలగానే మిగిలిపోతుంది అని ఇప్పటికైనా, ఈ పంచాయతీ పాలకవర్గం పట్టించుకుని స్థానిక మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారి దృష్టికి తీసుకుని వెళ్లాలని గ్రామ ప్రజలు మీడియాతో వాపోయారు