Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,163,883
Total recovered
Updated on March 26, 2023 7:58 PM

ACTIVE

India
9,433
Total active cases
Updated on March 26, 2023 7:58 PM

DEATHS

India
530,831
Total deaths
Updated on March 26, 2023 7:58 PM

రాష్ట్రాన్ని వైకాపా నుండి కాపాడుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

 

తొండంగి: మే 22: విశ్వం వాయిస్ న్యూస్:

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజా సంపదను ఆ పార్టీ నాయకులు దోసేస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గం తొండంగి మండలంలోని ఒంటిమామిడిలో మంగళవారం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుని తాము అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంచుతా నని చెప్పి. తీరా వచ్చాక 3 రాజధానులు చేస్తానని విశాఖపట్నంలో ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆయన కుటుంబానికి కడప, బెంగళూరు, హైదరాబాదు తదితర నగరాల్లో 40 నుంచి 60 గదులు గల ప్యాలస్ లు ఉన్నాయన్నారు. భార్య భర్తలు ఉండేందుకు అన్ని అన్ని అన్ని భవనాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర సంపదంతా దోచుకుని వచ్చే ఎన్నికల్లో డబ్బు తో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.ఓట్ల రాలంతా ఈ విషయాలను గుర్తుంచుకుని ఓటు వేయాలన్నారు.మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కేసులతో భయపెట్టి వైకాపా పాలన కొనసాగుతుందని ప్రజలకు రూపాయి ఇచ్చి100 దోచుకుంటున్నారని విమర్శించారు.అదేవిధంగా తుని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి యనమల కృష్ణుడు మాట్లాడుతూ

మన తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల్లో అయినప్పటికీ ప్రజా సమస్య పద్ధతిగా అందరికిని సమ స్పూర్తి సూచి ఆరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అటువంటి కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అవ్వ నివ్వండి ఈరోజు పార్టీ ముందుకు పార్టీని ముందుకు నడుపుతున్న టువంటి చంద్రబాబు నాయుడు అవ్వ నివ్వండి మన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఎప్పుడూ ప్రజల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఎక్కడలేని విధంగా మన పార్టీ మన రాష్ట్రంలో అంతగా ఆదరిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారని కృష్ణుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, జ్యోతుల నవీన్ అధ్యక్షులు రాంబాబు, పోల్లాటి శేషగిరి,సుర్ల లోవరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!