విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
నగరంలో 52 సంవత్సరాల ప్రతిష్టాత్మక చరిత్ర కల్గిన ఐడియల్ జూనియర్ కళాశాల మూసివేతకు గురవ్వడం ప్రభుత్వ ఏకపక్ష సంస్కరణల అరాచకాలకు పరాకాష్టగా వుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రాంట్ రద్దయ్యి ఎయిడెడ్ సిబ్బంది బదిలీతో బోర్డు అప్లియేషన్ కొరవడి వెన్నంటిన ఆర్థిక పరిస్థితుల రీత్యా 2022-23 నూతన విద్యా సంవత్సరం జూలై 1నుండి శాశ్వతంగా మూసివేయడానికి వహించిన తీర్మానం అత్యంత దురదృష్టకరమన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు రాక ప్రయివేటు కళాశాలల్లో పెట్టుబడి పెట్టలేక ఎయిడెడ్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఐడియల్ జూనియర్ మూసివేత ఆత్మహత్యా సదృశ్య మన్నారు. ఐడియల్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి హోదాకు మించిన స్థాయిలో ముఖ్యమంత్రి వద్ద హెచ్చు ప్రాధాన్యత వున్నందున తగిన కృషి చేసి జూనియర్ కళాశాల మూతబడకుండా వుండేందుకు ప్రభుత్వ తోడ్పాటుతో ప్రయత్నాలు చేయాలని రమణ రాజు సూచించారు.