విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జే. భానుప్రసాద్ హెచ్చరించారు. ప్రస్తుతం 144 సెక్షన్, 30 సెక్షన్లు అమలులో ఉన్నాయని ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు,నిరసనల వంటి కార్యక్రమాలు నిషిద్ధం అన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.