Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రాజన్నను మించిన జగనన్న ప్రజా సంక్షేమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* ప్రజలతో మమేకమౌతొన్న ముఖ్యమంత్రి
* చెప్పాడంటే చేస్తాడంతే
* స్ఫూర్తివంతమైన ప్రజాస్వామ్య పాలన
* రాష్ట్రంలో 95 సంక్షేమ పథకాల అమలు
* ప్రత్తిపాడులో వైకాపా ప్లీనరీలో నేతల ఉద్గాటన

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, జూన్ 26, (విశ్వం వాయిస్ న్యూస్) ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి చాలా ముఖ్య మంత్రులను చూసాం గానీ… ప్రజలతో ఇంతగా మమేక మౌతోన్న జగన్ వంటి ముఖ్యమంత్రిని మునుపెప్పుడూ మనం చూడలేదని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తనకు మునుపున్న ముఖ్యమంత్రుల పాలనాభివృద్ధికంటే నాలుగు అడుగులు ముందుకు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి వేస్తే ఆయన్ని మించి జగన్ పది అడుగులు ముందుకు వేస్తూ సంక్షేమ పాలన అందిస్తూ ఉన్నారని జగన్ ను కన్నబాబు ప్రస్తుతించారు. కాకనాడ జిల్లాలోని నియోజకవర్గం కేంద్రం ప్రత్తిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని స్థానిక లయన్స్ క్లబ్ లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ప్రజాపాలనలో సంక్షేమ పధకాల అమలులో ఏ వర్గాన్నీ విస్మరించ కుండా అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యనం ఇస్తూ నేను ఉన్నాను… నేను విన్నాను… అంటూ వెనుకడుగు వేయకుండా రాష్ట్రాభివృద్ధిలో జగన్ ముఖ్యంత్రి ముందుకు సాగుతున్నారని కన్నబాబు అన్నారు. మన వారు, పగ వారు, ఎదుటి పార్టీ వారు అనే తేడా లేకుండా రైతులకు రైతు భరోసా పధకం మొదలుకొని 95 సంక్షేమ పధకాలను చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ ను కార్యకర్తలు గర్వంగా చెప్పుకో వచ్చని కురసాల అన్నారు. 2014 – 2018 కాలంలో సంక్షేమ పధకాలకు జన్మభూమి కమిటీల ముందు ప్రజలు చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చేదని, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థతో నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా జగన్ ప్రజా పాలన అందిస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.

 

అంతకంటే మహా భాగ్యం ఏముందీ – ఎమ్మెల్యే

______________________________

 

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పధకాలు అన్నీ నేరుగా ప్రజలకు అందుతున్నాయని, ముఖ్యమంత్రి జగన్ పాలనను రాష్ట్ర ప్రజలు అందరూ మెచ్చు కుంటున్నారని, వచ్చే 2014 ఎన్నికల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ కావాలని కోరుకుంటున్నారని, లేకపోతే సంక్షేమ పధకాలు ఆగిపోతాయని భావిస్తూ ఉన్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే, ప్లీనరీ సమావేశ అధ్యక్షుడు, నియోజకవర్గ ప్రధమ పౌరుడు పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. ఈ నియోజకవర్గంలో 92,000 కుటుంబాలు ఉన్నాయని, వీటిలో 43,000 కుటునబాలు మినహా మిగతా 49,000 కుటుంబాలకూ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుతున్నాయని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో 88 గ్రామాలు ఉన్నాయనీ, 88 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయనీ, ప్రతీ గ్రామంలోనూ వివిధ సంక్షేమ పధకాలు అమలు అవుతున్నాయనీ ఆయన పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలోనూ వివిధ ప్రభుత్వ శాఖల భవనాలు, రోడ్లు, మురుగునీటి పారుదల కాలువలు తదితర నిర్మిస్తూ ఉన్నామని, జరుగుతున్న అభివృద్ధి అంతా మీకు తెలుసు అనీ, ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిందే ముందని ఆయన సభికులకు వివరించారు. మే 13 న నియోజక వర్గంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించామనీ, ప్రతీ గ్రామంలోనూ ప్రభుత్వం పట్ల ప్రజల ఆదరణ బావుందని, ఇవన్నీ చూసి ఓర్వలేని ప్రతిపక్షపార్టీ, దాని కనుసన్ననలో ఉన్న మిగతా అందరూ మళ్ళీ అధికారంలోకి రావడానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ పాలనపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన గుర్తు చేసారు. మన నియోజకవర్గంలో పార్టీ మరింతగా ఎదగాలని, 2024 లో కూడా జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని పర్వత పిలుపును ఇచ్చారు. జులై 8, 9 తేదీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో దాదాపు 10,00,000 మందితో నిర్వహించే పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి నియోజక వర్గంలోని ప్రతీ గ్రామం నుంచి కార్యకర్తలు తరలి వెళ్ళాలని ఎమ్మెల్యే పిలుపును ఇచ్చారు. నియోకవర్గం నుంచి కనీసం 9,000 మందైనా వెళ్ళాలని, అందుకు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. విజయవంతం చేయడమే మన లక్ష్యం అన్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత, నియోజకవర్గంలోని వైకాపా శ్రేణులూ, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement