Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

టేకు చెట్లు నరికేసిన సంఘటనపై ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ :

టేకు చెట్లను అక్రంగా నరికివేసిన ఘటనపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మండలంలోని చెల్లూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న టేకు చెట్లను ఈ నెల ఏడో తేదీన గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తొమ్మిది టేకు చెట్లను నరికి వేసినట్లు స్థానికులు ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ రమణ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కే రాంబాబు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో స్థానికులు గొల్లపల్లి రమణ అధికారులతో మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఉన్న టేకు చెట్లను నరికివేసిన స్థానిక కార్యదర్శి తెలియక పోవడం విడ్డూరం గా ఉందని గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది ఉన్నప్పటికీ వారికి సరైన అవగాహన లేకపోవడంతో సీనియర్ కార్యదర్శి డి శ్రీనివాస్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి రమణ అన్నారు . క్రమంగా నరికివేసిన టేకు చెట్లను పంచాయతీ కార్యదర్శి 9వ తేదీన స్వాధీనం చేసుకున్నారన్నారు. కాగా టేకు కలపను 24వ తేదీన గ్రామంలోకి తీసుకువచ్చి భద్రపరిచారు. ఈ మధ్యకాలంలో ఆ మానును ఏమైనట్టు చేనులో ఉన్నాయా లేక వాటిని వేరే చోట్ల తరలించిన విషయం బయట పడడంతో గ్రామానికి తీసుకొచ్చారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తునన్నారు. ఎంపీటీసీ అనురాధ ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారని అయన అన్నారు. స్థానికంగా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుపోవడంతో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాంబాబు అక్రమంగా చెట్టు కొట్టిన సుబ్బారెడ్డిని, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులను విచారించారు. చెట్లను నరికివేసిన ప్రదేశాన్ని, కలపను అధికారులు పరిశీలించి, నివేదిక తయారు చేసి ఉన్నత అధికారుల వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ ఆఫీసర్ రాంబాబు విలేకరులకు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement