WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఎన్నికలకు మేము సిద్దం …ఎన్నికలకు ముందు ఉంటాం…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోర్టులో కేసు వేసింది మీనాయకులే అది తెలుసుకుని మాట్లాడాలని

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:

ఎన్నికలకు మేము సిద్దం …ఎన్నికలకు ముందు ఉంటాం…

– నగర కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం మాది… ఓటమి భయం మీది …

– కోర్టులో కేసు వేసింది మీనాయకులే అది తెలుసుకుని మాట్లాడాలని

– గోరంట్ల కు సవాల్ విసిరిన టి.కే విశ్వేశ్వరరెడ్డి

రాజమహేంద్రవరం,(విశ్వం వాయిస్ న్యూస్):
ఆదివారం ఉదయం స్థానిక మున్సిపల్ కాలనీలో గల రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ఆఫీసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీ.కే. విశ్వేశ్వర రెడ్డి పాత్రికేయుల సమావేశం జరిగింది,ఈ సందర్భంగా టి.కే మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల అమెరికా నుంచి వచ్చి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వెంటనే రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించాలని ప్రగల్పాలు పలుకుతున్నారని మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరియు మా నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకు ఎప్పుడూ ఎన్నికలంటే భయంలేదని ఎన్నికలంటే ముందు ఉంటామని అంటూ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలు దాకా కలపడం జరిగిందని ఆ గ్రామాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులో కేసులు వేసినందున ఈ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని దానికి కారణం మీ తెలుగుదేశం నాయకులు కాదా అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని అడిగారు. ఆయన ఈ విషయం తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా అనేది వాళ్ల పార్టీ వారికి అర్థం కావట్లేదని చెబుతూ బుచ్చయ్య చౌదరికి విజ్ఞత ఉంటే వారి పార్టీ నాయకులు హైకోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకుని అప్పుడు ఈ మాటలు మాట్లాడితే బాగుంటుందని అయన అన్నారు.సమావేశంలో 40 వ వార్డు ఇంచార్జ్ జాల నటరాజ్,డాక్టర్ రాజశేఖర్,44 వ వార్డు ఇంచార్జ్ రేగుళ్ల బాల శ్రీధర్, 37వ వార్డు ఇంచార్జ్ సంభారపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement